రాష్ట్రంలో మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరతాయని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. 3 రాజధానులకు ప్రజామోదం ఉందని.. స్థానిక ఎన్నికల్లో వైకాపాకు 85 శాతం ప్రజా మద్దతు రావడమే దీనికి నిదర్శనమన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాబట్టే మూడు రాజదానులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు రాజధానులు కట్టడం మీ తరం కాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను(nara Lokesh comments on 3 capital cities) మంత్రి ఖండించారు. మూడు రాజధానులు కడతామో లేదో.. మా తరమో కాదో మీరే చూస్తారని సవాల్(minister kannababu fire nara Lokesh comments over 3 capitals) చేశారు.
'రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదనే తెదేపా భావిస్తోందని.. సరైన సమయంలో మిగిలిన ప్రాంతాల ప్రజలు సరైన పాఠాలు చెబుతున్నారు. భాజపా ఒక ప్రాంతానికే పరిమితం కావాలనుకుంటే ఆ పార్టీ నేతలు అమరావతికి మద్దతుగా వెళ్లవచ్చు(minister kannababu on three capital citys). అమరావతి ఉద్యమానికి అమిత్ షా మద్దతిచ్చారని భావించే.. మీ తరం కాదని తెదేపా నేతలు మాట్లాడుతున్నట్లున్నారు. రెండున్నర ఏళ్లలో అధికారంలోకి వస్తామని చంద్రబాబు కల కంటున్నారు. అది నిజం కాదన్నారు. రైతులను కేంద్రం ఆదుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సోము వీర్రాజు అంటున్నారు.. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సాయం చేయలేదో సోము వీర్రాజు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. రైతులపై రాజకీయాలు చేయొద్దు' అని పార్టీలకూ మంత్రి కన్నబాబు సూచించారు.