అందరూ కలిసి పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్న మంత్రి కన్నబాబు 21 వేల కోట్ల రూపాయల టర్నోవర్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (అప్కాబ్) చేరుకోవడంపై వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు హర్షం వ్యక్తం చేశారు. అప్కాబ్ 59వ ఆవిష్కరణ దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. రైతాంగం, గ్రామీణాభివృద్ధికి అందరూ కలిసి పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. డీసీసీబీల ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. డీసీసీబీల్లో పని చేసే వాళ్లు తక్కువని.. పెత్తనం చేసే వాళ్లు ఎక్కువగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు.
కానీ... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హెచ్ఆర్ పాలసీలను ఆధునీకరించిన కారణంగా.. అలాంటి వ్యవహారాలు తగ్గాయని మంత్రి చెప్పారు. సొసైటీల్లో నిధుల దుర్వినియోగం జరుగుతుందనే విషయం పలు సార్లు తమ దృష్టికి వచ్చిందన్న మంత్రి.. ప్రతి రూపాయికి కొత్తగా ఎంపికైన డీసీసీబీ ఛైర్మన్లు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ఈ సొసైటీల సేవలను మరింతగా విస్తరించాలని, అందుకు ప్రతి జిల్లా మరో జిల్లాతో పోటీ పెట్టుకోవాలని ఆదేశించారు.
ఐల్యాండ్ పార్కును ప్రారంభించిన మంత్రి బొత్స..
వనమహోత్సవం కార్యక్రమ అనంతరం మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ నగరంలో మున్సిపల్ శాఖకు సంబంధించి పలు కార్యక్రమాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. లెనిన్ సెంటర్లో ఐల్యాండ్ పార్కును మంత్రి ప్రారంభించారు. వన మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరిమున్నీసా, మేయర్ రాయన భాగ్యలక్ష్మిలతో కలిసి కండ్రికలో మొక్కలు నాటారు. విజయవాడలో జగనన్న పచ్చ తోరణం కింద వేల మొక్కలను నాటామని మంత్రి వెల్లడించారు. పర్యావరణం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. మొక్కలను వేసి వదిలేయడమే కాకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ఉండాలని మంత్రి చెప్పారు. విజయవాడ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
jagananna pachathoranam: మొక్కల పెంపకాన్ని ఓ యజ్ఞంగా చేపట్టాలి: సీఎం జగన్
devineni uma released: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి.. దేవినేని ఉమా విడుదల