ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వ్యవసాయశాఖలో ఖాళీలు త్వరలో భర్తీ చేస్తాం' - వ్యవసాయంపై కన్నబాబు కామెంట్స్ వార్తలు

ఏపీ అగ్రికల్చర్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ 2020 డైరీని మంత్రి కురసాల కన్నబాబు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి... ప్రభుత్వ పథకాలను ఉద్యోగులు రైతులకు చేరువచేయాలని కోరారు. వ్యవసాయశాఖలోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

Minister kannababu inaugurates Agriculure employees diary
వ్యవసాయశాఖ ఉద్యోగుల 2020 డైరీ ఆవిష్కరణ

By

Published : Feb 14, 2020, 10:18 PM IST

వ్యవసాయశాఖ ఉద్యోగుల 2020 డైరీ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ 2020 డైరీని విజయవాడలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, 13 జిల్లాల అగ్రికల్చర్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడ్డారని, 30 శాతం జీడీపీ వ్యవసాయ రంగానిదేనని మంత్రి కన్నబాబు వివరించారు. 11 వేల 128 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 45 లక్షల మంది రైతులకు భరోసా అందించామని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో ఉద్యోగుల కృషి మరువలేనిదన్నారు. వ్యవసాయశాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ త్వరలో చేపడతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details