రాష్ట్రంలో ఏదైనా ఓ సంఘటన జరిగితే తెదేపా అధినేత చంద్రబాబు మహాదానందం పొందుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఎద్దేవాచేశారు. రథం దగ్దమైతే ఆయన ఆనంద తాండవం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. భక్తి శ్రద్ధలతో సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే దానిక్కూడా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మతాన్ని అడ్డంపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన గురించి తెదేపాకు వివరాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు. తాము ప్రజలకు జవాబుదారీగా ఉంటామని.. తెదేపాకు కాదని స్పష్టంచేశారు.