ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Minister Kannababu: 'రెండేళ్లలో రూ.83వేల కోట్ల సాయమందించాం' - Minister Kannababu latest news

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నిర్వహించిన వర్చువల్‌ సమీక్షకు రాష్ట్రం తరఫున మంత్రి కన్నబాబు హాజరయ్యారు. ఏపీలో వ్యవసాయ రంగానికి చేయూతనివ్వాలని మంత్రి కోరారు. ఆయిల్‌ ఫామ్‌ సాగు, దిగుబడిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. రెండేళ్లలో రైతులకు రూ.83వేల కోట్ల సాయమందించామన్నారు.

Minister Kannababu
మంత్రి కన్నబాబు

By

Published : Sep 8, 2021, 6:48 AM IST

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నిర్వహించిన వర్చువల్‌ సమీక్షకు రాష్ట్రం తరఫున మంత్రి కన్నబాబు హాజరయ్యారు. ఏపీలో వ్యవసాయ రంగానికి చేయూతనివ్వాలని మంత్రి కోరారు. కరోనా పరిస్థితులలోనూ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశామని కేంద్ర మంత్రికి కన్నబాబు వివరించారు.

వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రెండేళ్లలో రైతులకు రూ.83వేల కోట్ల సాయమందించామన్నారు. గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆర్‌బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను పంపిణీ చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ ద్వారా ఆర్‌బీకే స్థాయిలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, కంబైన్డ్‌ హార్వెస్టింగ్‌ సెంటర్లుతో పాటు మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆయిల్‌ ఫామ్‌ సాగు, దిగుబడిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఒకసారి రాష్ట్రాన్ని సందర్శించాలని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ను మంత్రి కన్నబాబు కోరారు.

ఇదీ చదవండి

minister alla nani : 'సీజనల్‌ వ్యాధుల కట్టడికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టండి'

ABOUT THE AUTHOR

...view details