సమీకృత కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి… రైతుల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారులకు సూచించారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి.. ఆర్బీకేలలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రాష్ట్ర వ్యవసాయ కమిషన్, ఏపీ సీడ్స్ అధికారులు హాజరయ్యారు.
సమీకృత కాల్ సెంటర్ ద్వారా రైతుల ఫిర్యాదులు స్వీకరించాలి: మంత్రి కాకాణి - మంత్రి కాకాణి తాజా వార్తలు
సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్బీకేలలో అందుతున్న సేవల గురించి అధికారుల్ని అడిగిన వివరాలు తెలుసుకున్న మంత్రి.. సమీకృత కాల్ సెంటర్ ద్వారా రైతుల ఫిర్యాదులు స్వీకరించాలన్నారు.
సమీకృత కాల్ సెంటర్ ద్వారా రైతుల ఫిర్యాదులు స్వీకరించాలి