విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆరో రోజున దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపిన ఆయన...కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని...,ఎల్లప్పుడూ ఇలాగే సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి జయరాం - బెజవాడ దుర్గమ్మ సేవలో మంత్రి జయరాం
విజయవాడ దుర్మమ్మను కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు. నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి జయరాం