బుధవారం మంత్రి గుమ్మనూరు జయరాం(MINISTER JAYARAM) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్జిని(CM JAGAN) కలిశారు. సమావేశంలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా..వివాదాస్పదమైన ఆడియో టేప్ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. దందాగిరి చేయడానికి తాను అంతరాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్ కాదంటూ మండిపడ్డారు. పట్టుకున్న ఖాళీ ఇసుక ట్రాక్టర్లను వదిలేయమని పోలీసులతో చెప్పానని తెలిపారు. రైతుల ఖాళీ ట్రాక్టర్లను విడిచిపెట్టమన్నానే తప్ప.. పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడలేదని చెప్పారు. కొంతమంది కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అన్నారు. సీఎంగా జగన్ ఉన్నంతవరకు తననెవరూ ఏమీ చేయలేరని జయరాం వ్యాఖ్యానించారు.
MINISTER JAYARAM: తానేమీ స్మగ్లర్ వీరప్పన్ కాదన్న మంత్రి.. అలా ఎందుకన్నారంటే..!
మంత్రి గుమ్మనూరు జయరాం
14:38 September 08
సీఎంగా జగన్ ఉన్నంతవరకు నన్నెవరూ ఏమీ చేయలేరు
ఇదీ చదవండి: minister gummanuru jayaram: మంత్రినని ఆలోచించను... నేనే ధర్నాలో కూర్చుంటా!
మద్యం ఏరులై పారుతుందంటే తానేమీ చేయగలనని.. నియోజకవర్గాన్ని ఆనుకుని కర్ణాటక సరిహద్దు ఉందని మంత్రి జయరాం పేర్కొన్నారు. వీటిని నిలువరించడానికి ఎల్లవేళలా తానెలా కాపలా కాయగలనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
Last Updated : Sep 8, 2021, 7:16 PM IST