మీడియా సమావేశంలో మంత్రి జవహర్ గత రాత్రి తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడుజగన్ రహస్య ప్రదేశంలో భేటీ అయ్యారని మంత్రి జవహర్ ఆరోపించారు. వాళ్ళ మధ్యభారీ స్థాయిలోనగదు మార్పిడి జరిగిందనే సమాచారం తమకు ఉందని చెప్పారు. ఆ రహస్య భేటీని భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏర్పాటు చేశారన్నారు.గవర్నర్ కూడా ఈ కుట్రలో భాగమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యవస్థను ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చెయ్యాలని భాజపా, జగన్ కోరడం విడ్డురంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భాజపా నేతల మాటలు నమ్మరని స్పష్టం చేశారు.