ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ మంత్రి జగదీశ్​రెడ్డి వర్సెస్ ఉత్తమ్​కుమార్​రెడ్డి - మంత్రి జగదీశ్ రెడ్డి ఉత్తమ్ కుమార్​ రెడ్డి మాటకు మాట

నువ్వెంతంటే నువ్వెంత..నీ లెక్కెంతంటే నీ లెక్కెంత..ఈ మాటలు అనుకున్నది ఎవరో కాదు తెలంగాణ మంత్రి జగదీశ్​రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి. నల్గొండ జిల్లా కలెక్టరేట్​లో జరిగిన వానాకాల నియంత్రిత పంటల సాగు కార్యక్రమంలో ఒకరినొకరు కొట్టుకునేంత పని చేశారు.

minister-jagadish-reddy-tpcc-president-utham-kumar-reddy-argument-in-meeting
minister-jagadish-reddy-tpcc-president-utham-kumar-reddy-argument-in-meeting

By

Published : May 31, 2020, 6:20 PM IST

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమం రసాభాసాగా మారింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నువ్వెంత..నీ లెక్కెంత అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు.

వానాకాల నియంత్రిత్ర పంటల సాగు కార్యచరణ ప్రణాళికలలో భాగంగా నల్గొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్​రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని మంత్రి ప్రసంగిస్తుండగా ఉత్తమ్​కుమార్​రెడ్డి విబేధించారు. రుణమాఫీ ఎక్కడ చేశారని అడ్డుకున్నారు.


మంత్రి, ఎంపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నువ్వెంత..నీ లెక్కెంత అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. ఓ దశలో కొట్టుకునేంత పని చేశారు. దీంతో ఆ కార్యక్రమంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

ఇదీ చూడండి:తేనెటీగల దాడి..ఇబ్బంది పడ్డ మెగా ఫ్యామిలీ

ABOUT THE AUTHOR

...view details