Jagadeesh reddy Comments: మునుగోడు సభలో కేంద్ర మంత్రి అమిత్ షా అబద్దాలే మాట్లాడారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ఒక్క ప్రశ్నకు కూడా అమిత్‌షా వద్ద సమాధానం లేదన్నారు. ఫ్లోరైడ్ నివారణకు ప్రధాన మంత్రి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. పెట్రోల్ ధరలపై అమిత్ షా మాటలు దొంగేదొంగ అన్నట్లుందని ఎద్దేవా చేశారు. మునుగోడు ప్రజలు భాజపాకు డిపాజిట్ రాకుండా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ము అమిత్‌షాకు లేదన్న మంత్రులు - munugode BJP meeting
Jagadeesh reddy Comments తెలంగాణలోని మునుగోడు సభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు. ఎప్పటిలాగే మునుగోడులోనూ అమిత్‌షా అబద్దాలే మాట్లాడారని మంత్రి ఆరోపించారు. మునుగోడు ప్రజలు భాజపాకే మీటరు పెట్టడం ఖాయమని తెలిపారు.
"మునుగోడులోనూ అమిత్ షా అబద్ధాలే మాట్లాడారు. ఆధారం లేకుండా మాట్లాడే బండి సంజయ్ పాత్ర పోషించారు. కేసీఆర్ ఒక్క ప్రశ్నకూ అమిత్ షా వద్ద సమాధానం లేదు. సీఎం కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముకూడా లేదు. ప్రపంచంలోనే అద్భుత పథకం రైతుభీమా. ఫ్లోరైడ్ నివారణకు ప్రధానమంత్రి ఏమైనా చేశారా?. పెట్రోల్ ధరలపై అమిత్ షా మాటలు దొంగేదొంగ అన్నట్లుంది. మునుగోడు ప్రజలు భాజపాకే మీటరు పెడతారు. మునుగోడు ప్రజలు భాజపాకు డిపాజిట్ రాకుండా చేస్తారు."- జగదీశ్‌రెడ్డి, మంత్రి
ఇవీ చూడండి: