ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లిన డాక్టర్.. మంత్రి​ అభినందన

తెలంగాణలోని పెద్దపల్లిలో ఓ వైద్యుడు ఉదారత చాటుకున్నారు. పలువురికి వైద్యం చేయడమే గాక.. కరోనాతో చనిపోయిన వ్యక్తిని శ్మశాన వాటికకు తరలించేందుకు సహాయపడ్డారు. ఇది తెలిసిన మంత్రి హరీశ్​ రావు ఆ వైద్యుడిని అభినందించారు. "డాక్టర్​ శ్రీరామ్​ గారు.. హృదయపూర్వక అభినందనలు. మనుషుల్లో మానవత్వం బతికే ఉందని నిరూపించారు." అని ట్వీట్​ చేశారు.

minister-harish-rao-congrats-to-a-doctor-for-helping-in-covid-patient-funeral-in-peddapalli-district
minister-harish-rao-congrats-to-a-doctor-for-helping-in-covid-patient-funeral-in-peddapalli-district

By

Published : Jul 14, 2020, 12:56 AM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాధితో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు ఓ వైద్యుడు. ట్రాక్టర్​ నడపడానికి మున్సిపల్​ డ్రైవర్​ ముందుకు రాకపోవడం వల్ల వైద్యుడు శ్రీరామ్​ చొరవ చూపాడు.

ఆ ట్రాక్టర్ నడిపిన పెద్దపల్లి వైద్యుడు శ్రీరామ్​ను అభినందిస్తూ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. ట్రాక్టర్ నడిపిన మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి వైద్యుడు శ్రీరామ్ తన ఉదారతను చాటుకున్నారని ట్వీట్ చేశారు.

"డాక్టర్ శ్రీరామ్ గారు.. హృదయ పూర్వక అభినందనలు. మనుషుల్లో మానవత్వం బతికే ఉందని నిరూపించారు. మానవత్వంలోనే దైవత్వం దర్శించుకునేలా చేశారు. కరోనాపై యుద్ధం చేస్తున్న అందరికీ మీరు స్ఫూర్తి. ఈ కష్టకాలంలో ప్రజారోగ్య రక్షణకు పాటు పడుతున్న ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను."

-హరీశ్ రావు, తెలంగాణ మంత్రి

-

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కొత్తగా 1,935 కరోనా కేసులు, 37 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details