హరిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్టు వివరించారు.
హరిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వ కార్యాచరణ: మంత్రి గౌతమ్ రెడ్డి - విజయవాడ తాజా సమాచారం
ప్రస్తుతం విపత్తు నిర్వహణ అనేది అభివృద్ధి ప్రణాళికలో అంతర్భాగంగా మారిందని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. హరిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ కర్టెన్ రేజర్ సదస్సులో ఎన్విరాన్ మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ అంశంపై మంత్రి మాట్లాడారు.

మంత్రి గౌతమ్ రెడ్డి
ప్రస్తుతం విపత్తు నిర్వహణ అనేది అభివృద్ధి ప్రణాళికలో అంతర్భాగంగా మారిందని మంత్రి వ్యాఖ్యానించారు. డబ్ల్యూఈఎఫ్ కర్టెన్ రేజర్ సదస్సులో ఎన్విరాన్ మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ అంశంపై మాట్లాడారు. విజయవాడలోని ఆర్అండ్బీ భవనంలో ఉన్న ఏపీటీఎస్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి హాజరయ్యారు.
ఇదీ చదవండి