రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధి కళాశాలలను ప్రారంభించనున్నట్లు మంత్రి గౌతంరెడ్డి చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కళాశాలలకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధితోపాటు ఉపాధి కల్పనకూ చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. దిగ్గజ పారిశ్రామికవేత్త అదానితో.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందాలు తప్ప కొత్తవి ఏమీ లేవని వెల్లడించారు. సీఎం జగన్‌ను అదానీ కలిసినట్లు తన వద్ద ఎటువంటి సమాచారం లేదని మంత్రి వెల్లడించారు. గంగవరం పోర్టు వ్యవహారం కోర్టులో ఉన్నందున.. దానిపై స్పందించనని అన్నారు.
MINISTER GOUTHAM REDDY: 'అన్ని జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధి కళాశాలలు' - మంత్రి గౌతం రెడ్డి వార్తలు
అన్ని జిల్లాల్లో నైపుణ్య కళాశాలలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గౌతం రెడ్డి తెలిపారు. వీటితో పాటు ఉపాధి కల్పనకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
MINISTER GOUTHAM REDDY