ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోర్టు బిల్లుతో రాష్ట్ర హక్కులకు భంగమే: మంత్రి గౌతంరెడ్డి - రామాయపట్నం పోర్టు పనుల వివరాలు

ఇండియన్ పోర్టుల బిల్లు-2020 ముసాయిదాలో ప్రతిపాదించిన నిబంధనలతో రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతుందని మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి అభిప్రాయపడ్డారు. బిల్లులో ప్రతిపాదించిన కొన్ని అంశాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Ramayapatnam Port
రామాయపట్నం పోర్టు

By

Published : Jun 24, 2021, 4:37 PM IST

Updated : Jun 25, 2021, 3:27 PM IST

రామాయపట్నం పోర్టు పనులు నవంబరులో ప్రారంభిస్తాం

ఇండియన్ పోర్టుల (Ramayapatnam Port) ముసాయిదాపై.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Goutham reddy) స్పష్టం చేశారు. ముసాయిదా వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పారు. మైనర్‌ పోర్టుల నియంత్రణ కేంద్రం చేతిలోకి వెళ్లడం మంచిది కాదన్నారు. ఈ అంశంపై అధ్యయనానికి కేంద్రాన్ని సమయం కోరామని చెప్పారు. ఈ అంశంపై నిపుణుల కమిటీ నియమిస్తామని తెలిపారు.

అవసరమైతే తీరప్రాంత రాష్ట్రాల మద్దతు తీసుకుని పోరాడుతామని స్పష్టం చేశారు. మారిటైమ్ బోర్డుకు దీర్ఘకాలిక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని గౌతమ్‌రెడ్డి తెలిపారు. రామాయపట్నం పోర్టు పనులను నవంబర్‌లో ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 6 పోర్టులను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు.

Last Updated : Jun 25, 2021, 3:27 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details