పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు ఎన్ఓసీ తప్పనిసరి అని మంత్రి గౌతంరెడ్డి అన్నారు. పరిశ్రమల శాఖ రూపొందించిన 'రీస్టార్ట్' నిబంధనలపై ఆయన చర్చించారు. గ్రీన్‌జోన్‌లో పరిశ్రమలు తెరిచేందుకు తీసుకున్న చర్యలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పున:ప్రారంభమైన పరిశ్రమల్లో పని తీరుపై ఆరా తీశారు. పనులు సరిగా జరిగేందుకు తీసుకునే చర్యలపై మంత్రి సూచనలు చేశారు. తెరచుకోనున్న పరిశ్రమలకు ఎదురవుతున్న ఇబ్బందులపై గౌతంరెడ్డి చర్చించారు.
కార్మికుల భద్రతకే మా ప్రాధాన్యం: గౌతంరెడ్డి - minister gauthamreddy about labour care news
పరిశ్రమల్లో పని చేసే కార్మికుల భద్రతకే తమ ప్రాధాన్యమని మంత్రి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టి కార్మికుల రక్షణపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
minister gauthamreddy review on industries