ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల కోసం జపాన్ సహకారాన్ని ఆశిస్తున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. చెన్నైలోని జపాన్ రాయబార కార్యాలయం నుంచి ఏపీ పర్యటనకు వచ్చిన ఆ దేశ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోనూ భేటీ అయ్యింది. ప్రస్తుతం ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేసినట్టు జపాన్ బృందానికి మంత్రి గౌతమ్‌రెడ్డి వివరించారు.
పారిశ్రామిక కారిడార్లతో పాటు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. శ్రీకాళహస్తిలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను కూడా కాన్సులెట్ జనరల్‌కు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీసిటిలో జపాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ సేవలందిస్తోందని .. దీన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశాన్ని పరిశీలిస్తామని జపాన్ ప్రతినిధి బృందం వెల్లడించంది.