ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆలయాల శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి బొత్స - విజయవాడలో సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్న కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి బొత్స

తెదేపా హయాంలో తొలగించిన దేవాలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన ఏర్పాట్లను.. విజయవాడలో మంత్రి వెల్లంపల్లితో కలిసి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. రాష్ట్రంలో అలజడి రేపేందుకే ఆలయాలు, విగ్రహాలపై కొందరు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

minister botsa visit arrangements for cm jagan program in vijayawada
విజయవాడలో సీఎం జగన్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు బొత్స, వెల్లంపల్లి

By

Published : Jan 7, 2021, 9:04 PM IST

విజయవాడలో సీఎం జగన్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు బొత్స, వెల్లంపల్లి

విజయవాడలో పై వంతెన నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో తొలగించిన దేవాలయాల పునర్నిర్మాణానికి.. సీఎం జగన్ రేపు శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లితో కలిసి ఆయన పరిశీలిచారు.

రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకే ఆలయాలపై దాడులు చేస్తున్నట్లుందని పురపాలక శాఖ మంత్రి బొత్స అభిప్రాయపడ్డారు. రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదంపై పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details