ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి.. - సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

TENTH SUPPLY: రాష్ట్రంలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,91,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,23,231 మంది ఉత్తీర్ణత సాధించారు.

TENTH SUPPLY
TENTH SUPPLY

By

Published : Aug 3, 2022, 12:23 PM IST

TENTH SUPPLY: రాష్ట్రంలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలో 64.23 శాతం ఉత్తీర్ణత లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,91,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,23,231 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 60.83 శాతం, బాలికలకు 68.76 శాతం ఉత్తీర్ణత లభించింది. అత్యధికంగా ప్రకాశం జిల్లా 87.52%, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లా 46.66% ఉత్తీర్ణత సాధించింది.

"పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు బాగా నిర్వహించినందుకు శాఖాపరంగా గర్విస్తున్నాం. పాఠశాలల విలీన ప్రక్రియలో శాసనసభ్యుల అభిప్రాయం తీసుకుంటున్నాం. పిల్లలు గొప్పవాళ్లు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. గొప్పవాళ్లు కావాలనుకోవాలనుకునేవారు.. స్కూల్‌ పక్కనే ఉండాలని కోరుకోకూడదు. పాఠశాలల విలీనం జరగలేదు.. తరగతుల విలీనమే జరిగింది. రాబోయే తరాల భవిష్యత్తు కోసమే విలీనం నిర్ణయం తీసుకున్నాము. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సహకరించాలి. ఏ కార్యక్రమమైనా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేపడతాం. భేషజాలకు పోకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. సంయుక్త కలెక్టర్లు ఆధ్వర్యంలో కమిటీ నివేదిక వస్తుంది.. దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటాము"

బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details