ఏపీని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు స్పందించారు. కేటీఆర్.. తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో పరిస్థితి గురించి స్నేహితుడు చెప్పింది కేటీఆర్ చెప్పారన్న బొత్స... తానే స్వయంగా హైదరాబాద్ వెళ్లి ఉండి వస్తున్నానని అన్నారు. 'అక్కడ అసలు కరెంటే ఉండటం లేదు. నేను జనరేటర్ వేసుకొని అక్కడ ఉండి వచ్చాను. కేటీఆర్‌కు ఎవరో ఫోన్ చేసి చెప్పారు. కానీ నేను స్వయంగా అనుభవించి వచ్చా. బాధ్యత కలిగిన వ్యక్తి అలా మాట్లాడటం తప్పు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తమ ఘనత ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు. ఎదుటివారి గురించి ఇలా మాట్లాడకూడదు’ అని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.
kTR Vs AP Ministers: ఏపీ మంత్రులు వర్సెస్ కేటీఆర్ - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
14:35 April 29
'రాజకీయాల కోసమే.. ఏపీపై కేటీఆర్ వ్యాఖ్యల అంటూ ఆగ్రహం..'
రాజకీయాల కోసమే కేటీఆర్ వ్యాఖ్యలు: ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయాల కోసమే కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రైతులకు ఏడు గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. ఎక్కడైనా సాంకేతిక సమస్యతో పావుగంట మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ కరెంట్, నీళ్లు లేవో, రోడ్లు బాగాలేవో వచ్చి చూడాలి. ఏపీలోనే కాదు 16 రాష్టాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయి. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవా?. హైదరాబాద్‌ను మీరు కట్టలేదు.. ఉమ్మడి ఏపీలో అభివృద్ధి చెందింది. ఒక నగరాన్ని చూసి అపోహలకు గురి కావొద్దు. ఏపీ గురించి మాట్లాడినవారు జగన్ పాలనతో పోటీ పడాలి. 4 కాదు.. 400 బస్సులతో రావాలని కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ పరిస్థితి చూసేందుకు మేం కూడా బస్సులు పంపిస్తాం. -అమర్నాథ్, మంత్రి
ఇదీ చదవండి:ఏపీలో కరెంటు, నీళ్లు లేవు.. క్రెడాయ్ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్