Botsa Satyanarayana: వైకాపా ప్రభుత్వంలో చట్టానికి చుట్టాలు ఉండరని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలోని వైకాపా కార్యాలయంలో ఈనెల 26 నుంచి జరగనున్న బస్సు యాత్రపై చర్చించేందుకు పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
తప్పు చేయలేదనే ధైర్యంతోనే ఎమ్మెల్సీ బయట తిరుగుతుండొచ్చు: మంత్రి బొత్స - మంత్రి బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదు చేశామని.. నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నామని.. మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో చట్టానికి చుట్టాలు ఉండరని అన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
‘వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదు చేశాం. నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నాం. ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడో పెళ్లికి హాజరయ్యారని మీడియాలో చూశా. తప్పు చేయలేదనే ధైర్యంతో అలా తిరిగి ఉంటారు. ఘటన జరిగిన రోజే మృతుడి తల్లి, భార్య వాంగ్మూలం ఇచ్చి ఉంటే ఈపాటికే ఎమ్మెల్సీ అరెస్టయ్యేవారు. మృతుడి కుటుంబసభ్యులు రెండురోజుల పాటు నిర్లక్ష్యం చేశారు’ అని వివరించారు.
ఇదీ చదవండి: