నీటి పంపకాల వివాదం అంశంపై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని మంత్రి బొత్స స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదని.. ఫెడరల్ వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయన్నారు. విభజన చట్టానికి(bifurcation act) లోబడే నీటి పంపకాలు ఉంటాయని తెలిపారు. చట్ట పరిధులు దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయని బొత్స స్పష్టం చేశారు.
కేఆర్ఎంబీ(KRMB)కి సహకరిస్తామని తెలిపారు. తామ మౌనంగా లేమన్న మంత్రి.. తమ వ్యూహాలు తమకు ఉన్నాయన్నారు. మూడు రాజధానుల(3 Capitals) అభివృద్ధిలో భాగంగానే కరకట్ట విస్తరణ పనులు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని మంత్రి బొత్స వెల్లడించారు.