Botsa On swachh Amrut Mission Awards: స్వచ్ఛ అమృత్ మిషన్‌లో భాగంగా గతేడాది రాష్ట్రానికి 10 అవార్డులు వచ్చాయని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవి గ్రాఫిక్స్ చూపిస్తే వచ్చిన అవార్డులు కాదన్న బొత్స.. స్వచ్ఛ మిషన్‌లో కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ..పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. చెత్త తరలింపు కోసం ప్రతి వార్డుకూ ఒక వాహనం ఇచ్చామని బొత్స వెల్లడించారు. రాష్ట్రంలో మరో 23 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు.