రాష్ట్రంలో కొన్నిచోట్ల అర్హులకు పింఛన్ రావడం లేదన్న ఫిర్యాదులు తమకు అందాయని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అలాంటి వారు స్థానిక సచివాలయంలో మరోసారి దరఖాస్తు చేస్తే కేవలం ఐదు రోజుల్లోనే సమస్యను పరిష్కరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయన్న మంత్రి... అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో రూ. కోటీ 54 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించ తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీలో సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి బొత్స - మంత్రి బొత్స సత్యనారాయణ వార్తలు
నూతన పింఛన్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చారు.
minister bosta news