రాష్ట్ర వ్యాప్తంగా జూలై 8న చేపట్టనున్న ఇళ్ల పట్టాలు, ఇళ్లు అందజేత కార్యక్రమంపై అధికారులంతా దృష్టి పెట్టాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. విజయవాడ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లు, టిడ్కో అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రి మాట్లాడారు. పంపిణీ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలూ లేకుండా చూడాల్సిందిగా అధికారులకు స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీకి ఆటంకం కలగకుండా చర్యలు: మంత్రి బొత్స
జూలై 8న చేపట్టనున్న ఇళ్ల పట్టాలు, ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలూ లేకుండా చూడాల్సిందిగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ కేటాయింపులు ఉండాలన్నారు.
ఇళ్లపట్టాలు, ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై దృష్టి పెట్టాలి
ఇళ్లు, ఇళ్ల పట్టాల కేటాయింపు ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ కేటాయింపులు ఉండాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల లభ్యత, లబ్ధిదారుల సంఖ్య విషయంలో దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.