విద్యార్థులను పరిశోధనల వైపు నడిపిస్తే భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా రాణిస్తారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(అప్‌కాస్ట్) ఆధ్వర్యంలో ఏపీ సైంటిస్ట్ అవార్డు-2020 ప్రదానోత్సవం నిర్వహించారు. విజయవాడలోని బరంపార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
'శాస్త్ర, సాంకేతిక రంగాలతోనే అభివృద్ధి సాధ్యం' - minister balineni srinivasa reddy latest news
శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విజయవాడలో జరిగిన ఏపీ సైంటిస్ట్ అవార్డు-2020 ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
!['శాస్త్ర, సాంకేతిక రంగాలతోనే అభివృద్ధి సాధ్యం' minister balineni srinivasa reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11121478-1098-11121478-1616486658635.jpg)
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
స్వామినాథన్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని రైతులకు ఉపయోగకరంగా పరిశోధనలు చేయాలని బాలినేని సూచించారు. చిన్నారులను ప్రోత్సహించేందుకు బాలల సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నట్లు శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం కనబరిచిన 23 మంది ఆచార్యులకు మంత్రి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు.
ఇదీ చదవండి:జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్‌తో మంత్రి గౌతంరెడ్డి భేటీ