ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రతి గ్రామంలోనూ.. ఆటస్థలం ఉండేలా చర్యలు: మంత్రి అవంతి - మంత్రి అవంతి శ్రీనివాస్‌ వార్తలు

Minister Avanti Srinivas on sports review : రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ ఆటస్థలం ఉండేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.ఇప్పటి వరకు 2,325 ఆటస్థలాల ఏర్పాటు పూర్తైందని, అదనంగా మరో 4,555 ప్లే గ్రౌండ్లను శాప్ ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ మేరకు క్రీడల శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్షించారు.

Minister Avanti
Minister Avanti

By

Published : Feb 16, 2022, 3:35 PM IST

Minister Avanti Srinivas on sports review : రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ ప్లేగ్రౌండ్​ను ఏర్పాటు చేస్తున్నట్లు పర్యాటక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో ప్లే గ్రౌండ్లను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి గ్రామంలో ఆటస్థలం ఉండేలా చర్యలు: మంత్రి అవంతి శ్రీనివాస్‌

ఇప్పటి వరకు 2,325 ఆటస్థలాల ఏర్పాటు పూర్తైందని, అదనంగా మరో 4,555 ప్లే గ్రౌండ్లను శాప్ ప్రతిపాదించినట్లు తెలిపారు. క్రీడల శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్షించారు.

ఆమోదం రాగానే.. అభివృద్ది పనులు..
రాష్ట్రంలో రూ.185 కోట్లతో శాప్ ద్వారా క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 13 క్రీడా ప్రాంగణాలను పీపీపీ మోడ్‌లో అభివృద్ది చేసేందుకు ప్రతిపాదనలను సీఎంకు పంపించామని.. ఆమోదం రాగానే అభివృద్ది పనులు చేపడతామన్నారు. 6 గురుకుల పాఠశాలల్లో క్రీడా విభాగాలు ఏర్పాటు చేస్తున్నామని అనంతరం మిగిలిన గురుకులాల్లో క్రీడా విభాగాలు ప్రారంభిస్తామన్నారు.

ఇదీ చదవండి

"అంజనాద్రి అభివృద్ధికి.. వారి అంగీకారం అవసరమా..?"

ABOUT THE AUTHOR

...view details