ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం: అవంతి - ap tourism

అక్షర క్రమంలో ముందుండే అమరావతి... పర్యాటకంలోనూ ముందుండాలని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆకాంక్షించారు. విజయవాడ వచ్చే పర్యాటకులంతా భవానీ ద్వీపం చూసేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

అమరావతిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం: అవంతి

By

Published : Jun 23, 2019, 4:52 PM IST

అమరావతిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం: అవంతి

విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రాలో సముద్రం, నదులు, అడవులు వంటి పర్యాటక వనరులున్నాయన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. పర్యాటక ప్రాంతాలపై విస్తృత ప్రచారం చేయిస్తామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రత పెంచుతామని వివరించారు. అక్షర క్రమంలో ముందుండే అమరావతిని పర్యాటకంలోనూ ముందు ఉంచేందుకు కృషి చేస్తామన్నారు.

అనేక దేశాల్లో ప్రధాన ఆదాయవనరు పర్యాటకమేనన్న అవంతి... అతిథి దేవోభవ పేరుతో రాష్ట్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. భవానీ ద్వీపం అనుకున్న రీతిలో అభివృద్ధి చెందలేదని అభిప్రాయపడ్డారు. భవానీ ద్వీపాన్నీ అందమైన బృందావనంగా తీర్చిదిద్దుతామన్నారు. విజయవాడ వచ్చే పర్యాటకులంతా భవానీ ద్వీపం చూసేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండీ...'ఆరోపణలను తిప్పికొట్టండి.. శ్రేణులకు అండంగా ఉండండి'

ABOUT THE AUTHOR

...view details