ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

New Districts: జిల్లాల పునర్విభజనపై ప్రతిపక్ష నేతలది అనవసర రాద్ధాంతం: మంత్రి అవంతి - మంత్రి అవంతి శ్రీనివాస్ న్యూస్

Avanthi On New Districts: జిల్లాల విభజనపై తెదేపా అధినేత చంద్రబాబు అయోమయంలో ఉన్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. జిల్లాల విభజనపై తమ ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని.., జిల్లాలు విభజించినట్లే మూడు రాజధానుల ఏర్పాటూ ఉంటుందని పేర్కొన్నారు.

జిల్లాల పునర్విభజనపై ప్రతిపక్షనేతలది అనవసర రాద్ధాంతం
జిల్లాల పునర్విభజనపై ప్రతిపక్షనేతలది అనవసర రాద్ధాంతం

By

Published : Jan 31, 2022, 7:07 PM IST

Avanthi On New Districts:జిల్లాల పునర్విభజనపై ప్రతిపక్ష నేతలు అనవసర వ్యాఖ్యలు చేయటం సరికాదని పర్యటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని సీఎం జగన్ గతంలోనే ప్రకటించారని గుర్తు చేశారు. అందుకనుగుణంగానే పార్లమెంటు నియోజకవర్గాలకు వైకాపా అధ్యక్షుల్ని కూడా నియమించారన్నారు. జిల్లాల విభజనపై తెదేపా అధినేత చంద్రబాబు అయోమయంలో ఉన్నారని మంత్రి అవంతి ఎద్దేవా చేసారు. జిల్లాల పునర్విభజన అంశంపై చంద్రబాబు వైఖరేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

జిల్లాల విభజనపై తమ ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని అన్నారు. జిల్లాలు విభజించినట్లే మూడు రాజధానుల ఏర్పాటూ ఉంటుందని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో అప్పు చేయని రాష్ట్రమూ, దేశాలు లేవని అవంతి అన్నారు. అప్పును ఎలా తీర్చాలో సీఎం జగన్​కు తెలుసునని, దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా అప్పులు చేయరని తెలిపారు. సీఎం జగన్ మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారని అన్నారు. సంక్షేమ పథకాలు, క్యాలెండర్ అమలు ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రతీనెలా పండగేనని వివరించారు. పర్యటక శాఖ ద్వారా ఇప్పటికి రూ.87 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details