ఈనెల 12 నుంచి 16 వరకు లక్నోలో జరగనున్న జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొనే రాష్ట్ర యువజన బృందంతో విజయవాడలో యువజన సర్వీసులశాఖ కార్యాలయంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమావేశమయ్యారు. వీరిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ సంచాలకులు సి.నాగరాణి తదితరులు పాల్గొని యువ కళాకారులు మంచి ఫలితాలు సాధించారని ప్రశంసించారు. ఇవాళ రాత్రి ఈ బృందం రైలులో లక్నో వెళ్లనున్నారు. సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలు, శాస్త్రీయ సంగీతం, వక్తృత్వం, జానపద నృత్యాలు, గీతాలు, ఏకాంకిక విభాగాల నుంచి యువ కళాకారులను జాతీయ పోటీలకు ఎంపిక చేశారు.
యువ కళాకారులకు మంత్రి అవంతి అభినందనలు - జాతీయ యువజనోత్సవాలు- 2020
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన యువజనోత్సవాల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన యువతను మంత్రి అవంతి అభినందించారు. విజేతలు లక్నోలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు.
Minister avanthi congratulated the young artists