నివర్ తుపాను ప్రభావిత నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం,గుంటూరు, కృష్ణా జిల్లా అధికారులతో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా ఈ జిల్లాల్లోని చెరువులకు గండ్లు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. వర్షాల కారణంగా చెరువుల్లోకి పెద్ద మొత్తంలో నీరు చేరే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచనలిచ్చారు. ప్రస్తుత నిల్వలకు అనుగుణంగా అదనపు నీటిని కిందకు వదలాలని ఆదేశాలు జారీ చేశారు.
'నివర్' ప్రభావిత జిల్లాల అధికారులతో మంత్రి అనిల్ వీడియో కాన్ఫరెన్స్ - నివర్ ప్రబావిత జిల్లాలు
నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం,గుంటూరు, కృష్ణా జిల్లా అధికారులతో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వర్షాల కారణంగా చెరువుల్లోకి పెద్ద మొత్తంలో నీరు చేరే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచనలిచ్చారు.
'నివర్' ప్రభావిత జిల్లాల అధికారులతో మంత్రి అనిల్ వీడియో కాన్ఫరెన్స్