ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డయాఫ్రం వాల్ దెబ్బతిన్నచోట సత్వర మరమ్మతులు: మంత్రి అనిల్ - పోలవరం తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ప్రాంతాన్ని.. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. దెబ్బతిన్న ప్రాంతాన్ని నిపుణులతో మరమ్మతులు చేయించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

minister anil kumar yadav visits polavaram and examines damaged diaphragm wall
పోలవరంలో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అనిల్

By

Published : Mar 17, 2021, 8:44 AM IST

పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ప్రాంతాన్ని.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ప్రాంతాన్ని గుర్తించి.. సాంకేతిక నిపుణులతో తగిన మరమ్మతులు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

డయాఫ్రం వాల్ లోని 185 మీటర్ల మేర ప్రాంతం వరదల కారణంగా దెబ్బతిన్నట్టు గుర్తించామని అధికారులు మంత్రికి వివరించారు. బావర్ సంస్థ నిపుణులు త్వరలోనే ప్రాజెక్టుకు రానున్నట్లు తెలిపారు. స్పిల్ వే, కాఫర్ డ్యాంల నిర్మాణం పైలెట్ ఛానల్ కాంక్రీట్ పనులకు సంబంధించి పనులు పురోగతిని మంత్రి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details