ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అనుకున్న సమయానికే పోలవరం పూర్తి: మంత్రి అనిల్

తాము చెప్పిన ప్రకారం నవంబర్ 1 నుంచి పోలవరం పనులు ప్రారంభిస్తున్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అనుకున్న సమయానికే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామన్నారు.

మంత్రి అనిల్ కుమార్

By

Published : Nov 1, 2019, 1:22 PM IST

ముందుగా ప్రకటించినట్లే పోలవరం పనులు నవంబర్ 1 న ప్రారంభించినట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. పోలవరంపై ఉన్న స్టే ఎత్తి వేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పనులు ముమ్మరంగా చేసి 2021 మే నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ. 800 కోట్లు ఆదాయం తెచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. నవయుగ సబ్ కాంట్రాక్టర్ల గొడవతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. వరద జలాలతో రాయలసీమలో 86 శాతం ప్రాజెక్టులు నిండాయని.. తెదేపా హయాంలో పెండింగ్ పనులు పూర్తి చేయక పోవడం వల్లే పూర్తి స్థాయిలో నింపలేకపోయామన్నారు. గోదావరి నీటిని రాయల సీమకు తరలించేందుకు ఉన్న అన్ని ప్రతిపాదనలు పరిశీలిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ భూభాగం నుంచి నీటిని తీసుకునే ప్రాజెక్టుతోపాటు మరిన్ని ప్రత్యామ్నాయాలు చూస్తున్నటు వెల్లడించారు. పోలవరం నుంచి బానకచర్లకు కాలువ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టు డీపీఆర్ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. రెండింటినీ పరిశీలించి ఏది ప్రయోజనకరంగా ఉంటే ఆ ప్రాజెక్టును చేపడ తామని మంత్రి స్పష్టం చేశారు..

మంత్రి అనిల్ కుమార్

ABOUT THE AUTHOR

...view details