minister anil kumar yadav on cyclone: ఉత్తర కోస్తా జిల్లాలకు జవాద్ తుపాను ముప్పు పొంచి ఉండటంతో.. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. అధికారులతో సమీక్షించిన మంత్రి అనిల్ కుమార్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విజయవాడలోని ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయం నుంచి.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ఇరిగేషన్ అధికారులతో.. మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. మంత్రి అనిల్ అధికారులను ఆదేశించారు.
కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు..
తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోనూ కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రపు అలలు 3.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.