ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. తెదేపా అధినేత చంద్రబాబు ఎక్కడికి వెళితే.. పవన్ అక్కడికి వెళ్లి .. పర్యటిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ దమ్ము, ధైర్యం గురించి మాట్లాడే.. హక్కు పవన్‌కు లేదని అన్నారు. పాలించేందుకు కాదు ప్రశ్నించేందుకే అన్న పవన్ గత ఐదేళ్లలో ఏం చేశాడో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తెలుగు భాషపై పవన్‌కు ప్రేమ ఉంటే.. ఆయన పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నారని ప్రశ్నించారు. పవన్ నిత్యం కులాలు, మతాలు గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రెండు స్థానాల్లో పోటీ చేసి.. ఓడిపోయిన పవన్‌కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని ఉద్ఘాటించారు.
'రేణు దేశాయ్ ప్రశ్నలకే.. ఇంకా సమాధానం లేదు' - minister anil about renudesai news
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. పవన్‌ను రాజకీయ నాయకుడు అనాలో.. నటుడు అనాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

minister anil kumar yadav comments on janasena pawan kalyan