తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగరేసిన అంశం మీద కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. ఈ విషయంపై జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ స్పందించారు. చంద్రబాబు ఇంటిని ముంచాలనే ఆలోచన మాకు లేదని.. తెదేపా నేతలు లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గిందని... అయినా వరదపై దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. గరిష్ఠంగా 8.05 లక్షల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్ నుంచి వదిలినట్లు తెలిపారు. ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ దిగువకు నీటిని విడిచిపెట్టామన్నారు. రాయలసీమకు నీరివ్వడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. అధికారులతో సమీక్షలు చేయడం ఒక్కటే తమ బాధ్యత కాదని.. క్షేత్రస్థాయిలో ప్రజల బాగోగులనూ పట్టించుకుంటామని తేల్చి చెప్పారు.
'చంద్రబాబు ఇంటిని ముంచాలనే ఆలోచన లేదు' - anil
డ్రోన్ వివాదంపై మంత్రి అనిల్ స్పందించారు. తెదేపా లేని పోని ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. అధికారులు వారి పని వారు చేశారని.. తాము జోక్యం చేసుకోలేదని తెలిపారు.
minister_anil_comments_on_tdp
Last Updated : Aug 19, 2019, 9:47 PM IST