ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దాడి చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే: మంత్రి అనిల్ - దాడి చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే: మంత్రి అనిల్

శాసనమండలిలో తెదేపా సభ్యులపై దాడి చేసినట్లు నిరూపిస్తే.. ఏ శిక్షకైనా సిద్ధమని మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యనించారు. తెదేపా సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. మండలిలో తమపై దాడి చేసింది తెదేపా సభ్యులేనని ఆరోపించారు.

దాడి చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే: మంత్రి అనిల్
దాడి చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే: మంత్రి అనిల్

By

Published : Jun 18, 2020, 5:26 PM IST

శాసన మండలిలో తాను అసభ్యంగా వ్యవహరించినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యనించారు. తెదేపా సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై నిజనిరూపణకు తాను సిద్దమని సవాల్ విసిరారు. ఇందుకు సంబంధించి వీడియో ఫుటేజీని బయటపెట్టాలన్నారు. నిరూపించని పక్షంలో తాము పదవులకు రాజీనామా చేస్తామని తెదేపా సభ్యులు ముందుగా లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలిలో తమపై దాడి చేసింది తెదేపా సభ్యులేనని ఆరోపించారు.

మంత్రులు గడ్డం పెంచుకుని రౌడీయిజం చేస్తున్నారని తెదేపా సభ్యులు మమ్మల్ని విమర్శించారని.. దీనికి ప్రతిగా ఛైర్మన్​పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిప్డడారు. సభలో వీడియోలు తీయవద్దని లోకేశ్​కు ఛైర్మన్ కూడా చెప్పారని... ఆ సమయంలో చిత్రీకరణను అడ్డుకోబోతే మంత్రి వెల్లంపల్లిపై తెదేపా సభ్యులు దాడి చేశారన్నారు. బిల్లులను అడ్డుకునేందుకు వీలైనన్ని కుట్రలు చేశారన్నారు. మండలిలో విధ్వంసం చేస్తామని యనమల స్పష్టంగా చెప్పారని... తాను అలా అనలేదని ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details