పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టు అంశంపై..న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని..మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని ఉన్నత న్యాయస్థానం తుది తీర్పులో పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విధానపరమైన లోపం ఉందనే అభిప్రాయంతోనే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లుగా భావిస్తున్నామని వెల్లడించారు. నిర్ణయించిన కాలపరిమితిలోగా నవయుగ సంస్థ జలవిద్యుత్తు ప్రాజెక్టు పనులు చేయడం లేదని...ఈ విషయాన్ని ఆ కంపెనీయే అంగీకరించిందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం-న్యాయస్థానం ముందు ఉంచిందన్నారు. బిడ్డింగ్ నిబంధనలన్నీ ప్రజాధనం ధారాదత్తం చేసినట్లుగా ఉన్నాయని... ప్రజా ప్రయోజనాల కోసం రివర్స్ టెండరింగ్ చేపట్టినట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలియజేసిందన్నారు. ఈ ప్రాజెక్టు అంశంలో ప్రజాప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి అనిల్ తెలిపారు.
విధానపరమైన లోపం ఉందనే..మధ్యంతర ఉత్తర్వులు! - హైకోర్టు తీర్పు
పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టు అంశంపై న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాధనం రక్షించేందుకే జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపడుతున్నామన్నారు.
minister_anil_about_polavaram