ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం: మంత్రి అంబటి - minister ambati rambabu speaks over works of polavaram project

Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువు లేదని.. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గోదావరి డెల్టాకు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సాగునీటిని మంత్రి అంబటి విడుదల చేశారు.

minister ambati rambabu speaks over works of polavaram project
పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం: మంత్రి అంబటి

By

Published : Jun 1, 2022, 1:21 PM IST

పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం: మంత్రి అంబటి

Ambati Rambabu: పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని.. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువు లేదని తేల్చి చెప్పారు. గోదావరి డెల్టాకు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సాగునీటిని మంత్రి అంబటి విడుదల చేశారు. అనుకున్న విధంగానే జూన్ 1 న నీటిని విడుదల చేశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంపైనా మాట్లాడిన ఆయన.. డయా ఫ్రం వాల్‌కు మరమ్మతులపై మేధావులు తలలు పట్టుకుంటున్నారని చెప్పారు.

డయా ఫ్రం వాల్ ఎవరి చర్య వల్ల దెబ్బతిందో చర్చ జరగాలి. చంద్రబాబు, దేవినేని ఉమను చర్చకు రావాలని సవాల్ చేస్తున్నా. ఇంజినీర్లు, మేధావులు, మీడియాతో చర్చ జరగాలి. కాఫర్ డ్యామ్‌ పూర్తికాకుండా డయా ఫ్రం వాల్ కడతారా? డయా ఫ్రం వాల్ కొనసాగించాలా?.. కొత్తది నిర్మించాలా?. డయా ఫ్రం వాల్‌కు మరమ్మతులపై మేధావులు తలలు పట్టుకుంటున్నారు. దశలవారీగానే ఏ ప్రాజెక్టు అయినా పూర్తవుతుంది. మొదటి దశ పూర్తికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువు లేదు. - అంబటి రాంబాబు, జలవనరులశాఖ మంత్రి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details