విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కమిటీ వేశామని.. పూర్తిస్థాయి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కలెక్టరేట్లో ఈ ఘటనపై ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి సుచరిత, మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసులు, కలెక్టర్ ఇంతియాజ్, తదితర అధికారులు పాల్గొన్నారు.
కమిటీ వేశాం
మొత్తం 31 మంది రోగుల్లో 10 మంది చనిపోగా.. 21 మంది క్షేమంగా ఉన్నారు. ఆరుగురు సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారు. ఈ ప్రమాదంపై కమిటీ వేశాం. ఆస్పత్రికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయా లేదో ఈ కమిటీ పరిశీలిస్తుంది. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని కమిటీ విచారణ చేస్తుంది. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 48 గంటల్లో పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశించాం. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే అత్యంత కఠిన చర్యలు ఉంటాయి. నివేదికలు రాగానే చర్యలు తీసుకుంటాం- ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ఇదీ చదవండి
'ఈ ప్రమాదం హృదయవిదారకరం.. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి'