రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన 590 టన్నుల ఆక్సిజన్ కోటాను వినియోగించుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఫలితంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు.
ఇదే అంశంపై సీఎం కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించామన్న ఆళ్ల నాని... ఆక్సిజన్ సరఫరా మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.