ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ది కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది'

By

Published : Jul 21, 2021, 1:44 AM IST

విద్యార్థుల్లో వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గేమ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో విద్యార్థులకు చేపట్టిన వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మంత్రి ప్రారంభించారు.

మంత్రి ఆదిమూలపు సురేష్
మంత్రి ఆదిమూలపు సురేష్

విద్యార్థుల్లో వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గేమ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో విద్యార్థులకు చేపట్టిన వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు నాయకత్వం పేరుతో వ్యాపార వ్యవస్థాపక నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

21వ శతాబ్దపు సహజ నైపుణ్యాలను విద్యార్థుల్లో గుర్తించేలా చేయడం, ఆర్థిక స్థిరత్వాన్ని గురించి ఆలోచించేలా చేయడంతో పాటు వృత్తి విద్య నుంచి ఒక మార్కెట్ వ్యాపారం వైపు ఆలోచించే విధంగా అవకాశాలను గుర్తించేలా విద్యార్థుల కు శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు. మూడు దశల్లో ఈ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఉన్నత పాఠశాలల్లో అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. సమగ్ర శిక్ష, ఎస్​సిఆర్టీ సహాయంతో 10 రోజుల పైలట్ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి:

Night curfew in ap: మరో వారం.. రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు

ABOUT THE AUTHOR

...view details