ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KATHI MAHESH: కత్తి మహేశ్ మృతిపై ఫిర్యాదు చేస్తే విచారణకు సిద్ధం: మంత్రి సురేశ్ - Suspicions on Katti Mahesh's death

సినీ నటుడు కత్తి మహేశ్ మృతిపై ఆయన కుటుంబసభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపేందుకు సిద్ధమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. మహేశ్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ.. కొందరు చేస్తున్న ప్రకటనలపై మంత్రి స్పందించారు.

minister adimulapu suresh on katti mahesh death
కత్తి మహేశ్ మృతిపై విచారణకు సిద్ధం

By

Published : Jul 14, 2021, 9:51 PM IST

సినీ నటుడు, దర్శకుడు కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు ఉంటే విచారణ జరిపేందుకు సిద్ధమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. మహేశ్.. దళితుల్లో ఉన్నతస్థితికి ఎదిగిన వ్యక్తి , వైకాపా సానుభూతిపరుడు అని మంత్రి తెలిపారు. తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా ప్రచారంలోనూ పాల్గొన్నారని సురేశ్ వెల్లడించారు. కత్తి మహేశ్ వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి జగన్ రూ. 17 లక్షల మంజూరు చేసారని గుర్తు చేశారు.

మహేశ్​ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ.. కొందరు చేస్తున్న ప్రకటనలపై మంత్రి స్పందించారు. మృతికి సంబంధించి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మహేశ్ కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details