జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులు అందరికీ అందించే విషయమై వారోత్సవాల్లో పరిశీలన చేయనున్నారు. పథకంలో లోటుపాట్లను సరిదిద్దుకునేందుకే ఈ వారోత్సవాలు నిర్వహణ చేపట్టినట్టు విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ వెల్లడించారు. కుట్టు కూలీ ఖర్చులు నేరుగా తల్లుల ఖాతాకే ప్రభుత్వం జమచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. యూనిఫాం కొలతలు, దుస్తులు కుట్టించుకోవడంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామన్నారు. జగనన్న విద్యా కానుక కిట్ల వినియోగంపై వివరిస్తామని మంత్రి తెలిపారు.
నవంబర్ 23 నుంచి 28 వరకు విద్యాకానుక వారోత్సవాలు - జగనన్న విద్యాకానుకపై మంత్రి ఆదిమూలపు సురేశ్ కామెంట్స్
నవంబర్ 23వ తేదీ నుంచి 28 వరకు విద్యా కానుక వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్ పాఠశాలల్లో జగనన్న విద్యా కానుక వారోత్సవాలను విద్యాశాఖ చేపట్టనుంది.
నవంబర్ 23 నుంచి 28 వరకు విద్యాకానుక వారోత్సవాలు