ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

షెడ్యూల్ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు: మంత్రి సురేశ్ - ఇంటర్ పరీక్షలపై మంత్రి సురేశ్ కామెంట్స్

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని శానిటైజ్ చేసి..కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

Minister Adimulapu Suresh on inter exams
షెడ్యూల్ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు

By

Published : Apr 29, 2021, 3:45 PM IST

Updated : Apr 29, 2021, 4:54 PM IST

షెడ్యూల్ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు

రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా.. జాగ్రత్తగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కరోనా నిబంధనలను హాల్‌ టికెట్‌ వెనుక ముద్రించామని ఆయన వెల్లడించారు. ఎవరికైనా వైరస్ లక్షణాలుంటే కొవిడ్ ప్రోటోకాల్ అధికారిని సంప్రదించాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో..ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని..ఎవరికైనా లక్షణాలుంటే అక్కడే ఉంచి పరీక్ష రాయిస్తామన్నారు. పారామెడికల్‌ సి‌బ్బందిని పంపాలని వైద్యారోగ్యశాఖను కోరినట్లు తెలిపారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు రాయకూడదని ఆయన సూచించారు.

"మే 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 1,452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో 80 నుంచి 90 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో ప్రత్యేక అధికారి ఉంటారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని శానిటైజ్ చేసి సిద్ధం చేస్తాం. వెబ్‌సైట్‌లో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి హాల్ టికెట్ తీసుకోవచ్చు. ఐపీఈ సెంటర్‌ ఎగ్జామ్‌ లొకేటర్‌ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు." -మంత్రి సురేశ్

పరీక్షలపై ప్రతిపక్ష నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి సురేశ్ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా ఇంటర్ పరీక్షలు రద్దు చేయలేదని...,పరీక్షల నిర్వహణ నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందన్నారు. అన్ని విధాలా ఆలోచించి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేయటం సరికాదన్నారు. పరీక్షలు లేకుండా పాస్‌ సర్టిఫికెట్‌ ఇస్తే..భవిష్యత్తులో పిల్లలకు అనేక ఇబ్బందులు వస్తాయని మంత్రి వెల్లడించారు.

ఇదీచదవండి: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కరోనా సోకదా..?: నారా లోకేశ్​

Last Updated : Apr 29, 2021, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details