కరోనా కారణంగా రాష్ట్రంలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ రానివ్వమని విద్యాశాఖ మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. కరోనా పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు, భద్రతపై సీఎం జగన్ సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పది, ఇంటర్ పరీక్షలకు ఇప్పటికే షెడ్యూల్ సిద్ధం చేశామన్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలపై నిర్ణయం: మంత్రి సురేశ్ - విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ న్యూస్
రాబోయే రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. కరోనా కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ రానివ్వబోమన్నారు. పది, ఇంటర్ పరీక్షలకు ఇప్పటికే షెడ్యూల్ సిద్ధం చేశామని స్పష్టం చేశారు.
పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలపై నిర్ణయం