ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. టెస్టుల ఆన్‌లైన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశామన్నారు. ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించినట్లు సురేశ్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని అంశాలను ముఖ్యమంత్రికి వివరించామన్నారు. 170 సెంటర్లలో సగం సామర్థ్యంతో పరీక్షలు నిర్వహించే విషయాలు తెలిపామని..సెప్టెంబర్ మూడో వారానికి సెట్లను వాయిదా వేయాలని సీఎం ఆదేశించారని మంత్రి సురేశ్ వెల్లడించారు. ప్రవేశ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
ఎంసెట్ సహా...పలు ప్రవేశ పరీక్షలు వాయిదా: మంత్రి సురేశ్ - మంత్రి ఆదిమూలపు సురేశ్ తాజా వార్తలు
ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి సురేశ్ తెలిపారు. మొత్తం 8 సెట్ల పరీక్షలు వాయిదా వేస్తున్నామన్నారు.
minister adimulapu suresh on exams