నగరాభివృద్ధి, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగరంలో పర్యటించారు. స్థానికులతో కలిసి రోడ్డు పక్కన టీ తాగి... వారితో కాసేపు ముచ్చటించారు. సమస్యలు విని... నగరాభివృద్ధికి కావాల్సిన సలహాలు తీసుకున్నారు. మెుదట బ్రాహ్మణ వీధి, నెహ్రూ బొమ్మ సెంటర్, సొరంగం ప్రాంతం, భవానీపురం, ఊర్మిళనగర్, కామకోటి నగర్, జోజీ నగర్, హెచ్బీ కాలనీ, శివాలయం వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రితో పాటు నగరపాలక సంస్థ అధికారులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వైకాపా శ్రేణులు ఉన్నారు.
విజయవాడ వీధుల్లో... మంత్రి వెల్లంపల్లి..!
ప్రజలకు సేవ చేసేందుకు వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని... దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగరంలో ద్విచక్ర వాహనంపై ఆయన పర్యటించారు.
miniser vellampalli tour on bike