ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sand Reaches: ఇసుక తవ్వకాలపై దృష్టిపెట్టలేం.. అది వారి బాధ్యత: గనులశాఖ ముఖ్య కార్యదర్శి - ఏపీలో ఇసుక రీచ్​లు

Sand Reaches: ఇసుక రీచ్​లలో తవ్వకాలపై ప్రతి నిమిషం దృష్టిపెట్టలేమని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తేల్చి చెప్పారు. అధికారికంగా జేపీ వెంచర్స్ సంస్థకు లీజుకు ఇచ్చినందున సదరు సంస్థే అన్నింటికీ బాధ్యత వహించాలన్నారు.

ఇసుక తవ్వకాలపై దృష్టిపెట్టలేం
ఇసుక తవ్వకాలపై దృష్టిపెట్టలేం

By

Published : Dec 21, 2021, 9:07 PM IST

Sand Reaches:ఇసుక రీచ్​లను కాంట్రాక్టు సంస్థకు ఇవ్వటం ద్వారా ప్రభుత్వానికి రూ.765 కోట్ల ఆదాయం వస్తోందని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఇసుక రీచ్​లలో తవ్వకాలపై ప్రతి నిమిషం దృష్టిపెట్టలేమని ఆయన తేల్చి చెప్పారు. అధికారికంగా జేపీ వెంచర్స్ సంస్థకు లీజుకు ఇచ్చినందున సదరు సంస్థే అన్నింటికీ బాధ్యత వహించాలన్నారు. ఇసుక ఏపీఎండీసీ అధీనంలో ఉన్న సమయంలో కేవలం రూ. 300 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని ఆయన వివరించారు. వినియోగదారులకు నాణ్యమైన, ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లో ఇసుక లభ్యం కావాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. జేపీ పవర్ వెంచర్స్ ఎవరికి సబ్ లీజుకు ఇచ్చినా ఇబ్బందేమీ లేదని ద్వివేది తెలిపారు. అకాల వర్షాల కారణంగా 100 రీచ్​లు మూత పడ్డాయని..,అయితే ఇవి క్రమంగా తెరుచుకుంటున్నాయన్నారు.

గతంలో ఉచిత ఇసుక ఉన్నప్పటికీ ఎవరికి అది ఉచితంగా లభించలేదని గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు సహజ వనరుల్ని దోపిడీ చేశారన్నారు. సుస్థిరమైన వ్యవస్థ కోసం కొత్త విధానం అమలవుతోందన్నారు. ఇసుక తవ్వకాలను ప్రభుత్వం ఎక్కడా సబ్ లీజుకు ఇవ్వలేదని.. అసలు సబ్ కాంట్రాక్టు ఎవరికి ఇచ్చారన్న అంశం ప్రభుత్వానికి అనవసరమన్నారు. రీచ్​లలో జియో కోఆర్డినేట్స్​ను అనుసరించి మాత్రమే తవ్వకాలు జరుగుతాయన్నారు. ప్రతీ నెలా గనుల శాఖ తనిఖీలు చేస్తోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details