రాష్ట్రంలో కర్ఫ్యూ కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు తమ స్వస్థలాలకు వెళుతున్నారు. ఇతర రాష్ట్రాలకు నడిచే బస్సులు నిలిచిపోవడంతో సమీప ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్నారు. కరోనా ఉద్ధృతితో దక్షిణ మధ్య రైల్వే సైతం పలు రైళ్లను రద్దు చేయడంతో చేసేది లేక వారంతా స్టేషన్ బయట షెడ్లలో విశ్రాంతి తీసుకుంటున్నారు. స్వచ్ఛంధ సంస్థలు అందించిన ఆహార పొట్లాలు తీసుకుని ఆకలి తీర్చుకుంటున్నారు.
మళ్లీ వలస కష్టం.. తరలివెళ్తున్న కూలీలు - వలస కార్మికుల ఇబ్బందులు తాజా వార్తలు
రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న కారణంగా.. వలస కూలీలు తిరిగి తమ స్వస్థలాల బాట పట్టారు. కరోనా ఉద్ధృతితో దక్షిణ మధ్య రైల్వే సైతం పలు రైళ్లను రద్దు చేయడంతో చేసేది లేక వారంతా స్టేషన్ బయట షెడ్లలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

migrants problems